Breaking News

Kondapur: రేవ్‌ పార్టీ భగ్నం

Published on Mon, 07/28/2025 - 07:52

హైదరాబద్‌: వీకెండ్‌లో అమ్మాయిలతో డ్యాన్స్‌లు, గంజాయి, డ్రగ్స్, మందు తాగుతూ చిందేస్తుండగా..పక్కా సమాచారంతో ఎస్‌టీఎఫ్‌ బీ టీమ్, ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రేవ్‌పార్టీని భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే... కొండాపూర్‌ జేవీహిల్స్‌ కాలనీలోని ఎస్‌వీ.నిలయం అనే సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో వీకెండ్‌లో ఏపీకి చెందిన కొందరు కొంతకాలంగా రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా అలాంటి పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందగా దాడులు చేశారు. 

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్‌ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్‌ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్‌ బీ టీమ్‌ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్‌ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్‌ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. 

అరెస్ట్‌ అయిన వారిలో డ్రగ్స్‌ తెప్పించే కింగ్‌కెన్‌షేర్‌ రాహుల్, ఆర్గనైజర్‌ ప్రవీణ్‌కుమార్‌ అలియాస్‌ మన్నె అప్పికొట్ల అశోక్‌కుమార్, మరో ఆర్గనైజర్‌ సమ్మెల సాయికృష్ణ, హిట్‌ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతాతేజ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేసిన వాహనాల్లో టీడీపీ నాయకులకు చెందినవి ఉన్నట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అశోక్‌ నాయుడు వాహనం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  

 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు