Breaking News

రామంతాపూర్‌లో ఉద్రిక్తత..

Published on Mon, 08/18/2025 - 12:15

సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు. దీంతో, బాధిత కుటుంబ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. 

మరోవైపు.. రామంతాపూర్‌లో పోలీసులు, అధికారులను మృతుల బంధువులు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్‌ శాఖ సీఎండీని బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.

ప్రమాదంలో చనిపోయిన ఆరు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో, ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసలు.. అక్కడున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుక విషాదకర ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఊరేగింపు రథానికి కరెంట్‌ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో, మృతుల కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)