Breaking News

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రత్యేకత ఏంటంటే..: శిల్పి రమణారెడ్డి

Published on Fri, 12/06/2024 - 17:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు విగ్రహ శిల్పి రమణా రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర అన్నారు. నూతన తెలంగాణ తల్లి.. సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదున్నారు.

తెలంగాణ తల్లి శిల్పి రమణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల అస్థిత్వం. తెలంగాణ ప్రజల మాతృమూర్తి. తెలంగాణ చరిత్ర.. అరుదైన పోరాటాల చరిత్ర. దశాబ్దాల పోరు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో వేలాది అమరుల త్యాగాలతో, సోనియమ్మ ఆశీర్వచనాలతో సాధించింది ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు సకల బహుజనులు సాధించిన విజయం. నూతన తెలంగాణ తల్లి రూపకల్పన తెలంగాణ సాంప్రదాయాన్ని, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని వ్యక్తపరుస్తుంది.

పూర్వ తెలంగాణ తల్లి రాచరికపు హావభావాలు, వాస్తవ ప్రజానీక సంస్కృతికి భిన్నంగా, ధనిక స్త్రీగా చిత్రీకరించడం జరిగింది. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేక పోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక దేవతామూర్తికి, మాతృమూర్తికి ఎంత వ్యత్యాసం ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ తల్లి. బోనాలు, బతుకమ్మ, సమక్క సారలమ్మ, సదర్ పండుగలతో, విశిష్ట శిల్ప సంపదలతో, చేతివృత్తులు, చేనేత ప్రతిభలతో విరజిమ్ము తన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.

నూతన తెలంగాణ తల్లి సాంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్పూర్తిగా, భరతమాత ముద్దు బిడ్డగా తెలంగాణ భావితరాల విశ్వాస స్ఫూర్తిగా, అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ఫ్రొఫెసర్ గంగాధర్. నాటి ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకే అప్పటి తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది’ అని కామెంట్స్‌ చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)