Breaking News

రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి

Published on Wed, 07/17/2024 - 20:21

పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్‌ వెంకటేశ్వర్లు, జనరల్‌ మజ్దూర్‌ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు.  మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి  విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. 

.. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్‌లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)