Breaking News

1న బంగాళాఖాతంలో అల్పపీడనం

Published on Mon, 09/29/2025 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతం, దానికి సమీపంలోని మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్‌ 1వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం నాటికి అదే ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడుతుందని, ఆ తర్వాత ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. 

ఉత్తర, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మంగళవారం నాటికి ఈశాన్యం అరేబియన్‌ సముద్ర ప్రాంతంలో మరో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఒకటి పశి్చమ విదర్భ, దాని సమీపంలోని మధ్య మహారాష్ట్ర ప్రాంతంలోని అల్పపీడన కేంద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్రా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వివరించింది. 

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.  

రెండ్రోజుల్లో ముగియనున్న నైరుతి సీజన్‌  
నైరుతి రుతు పవనాల సీజన్‌ మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్‌1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకున్న మధ్య కాలాన్ని నైరుతి రుతు పవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి నైరుతి రుతు పవనాల ఉపసంహరణ పూర్తి కాగా, వచ్చేనెల రెండో వారం చివరి నాటికి భారత భూభాగం నుంచి పూర్తిగా తిరోగమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈసారి నైరుతి రుతు పవనాల సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. 

తొలి అర్ధభాగం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదైనా, ఆ తర్వాత రుతు పవనాల కదలికలు అత్యంత చురుగ్గా ఉండడంతో వానలు జోరందుకున్నాయి. నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో సగటున 74.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 98.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే దాదాపు 35 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలతో సీజన్‌ వర్షపాతం 100 సెంటీమీటర్లు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ సీజన్‌లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే... 147 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 291 మండలాల్లో అధిక వర్షపాతం, 181 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 2 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)