Breaking News

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన

Published on Mon, 09/23/2024 - 04:49

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్‌ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 

31 శాతం అధికంగా వర్షాలు... 
నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.36 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని రాష్ట్ర ప్రణాళిక శాఖ అధి కారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సె ప్టెంబర్‌ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజ న్‌ ముగుస్తుంది.

సీజన్‌ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాలవారీగా వర్షపా తం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అ త్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్న ట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)