Breaking News

కామారెడ్డి జిల్లా: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు

Published on Thu, 08/28/2025 - 18:17

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మరో రెండు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి(శుక్ర,శని) కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. నిర్మల్‌ ఇంకా రెడ్‌ అలర్ట్‌లోనే ఉందని కలెక్టర్‌ అభినవ్‌ తెలిపారు. అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దన్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్మల్‌కు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు.

తెలంగాణ డీజీపీ జితేందర్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు వేల మందిని రెస్క్యూ చేశామని.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినట్లు  వెల్లడించారు. 2 వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్‌లో పెట్టామని తెలిపారు.

‘‘ఎన్డీఆర్‌ఎఫ్‌కు దీటుగా ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని.. భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ గత ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతేనే బయటకు రండి. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది’’ అని డీజీపీ చెప్పారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)