Breaking News

తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Published on Wed, 07/29/2026 - 21:55

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు, ములుగు జిల్లా, వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గంగా కాలువలు తవ్వించి నీటి పారుదలకు చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది కలిసి ప్రయత్నాలు నిర్వహించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది..

  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సామర్థ్యం 20 టీఎంసీ లకు గాను 11.1105 టీఎంసీలు

  • నీటిమట్టం 148 మీటర్లకు గాను 144.22 మీటర్లు

  • ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 75,328 క్యూసెక్కులు

  • అవుట్ ఫ్లో: 12,875 క్యూసెక్కులు


     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)