Breaking News

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు..

Published on Thu, 03/20/2025 - 10:54

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటి వరకు 27 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆడ శిశువును నాలుగు లక్షలకు, మగ శిశువులను ఆరు లక్షలకు అమ్మినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ముంబై, యూపీలోని పలు ఏరియాలను టార్గెట్ చేసి ట్రాఫికింగ్ ముఠా.. చిన్న పిల్లలకు విక్రయిస్తోంది. పశ్చిమ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో పిల్లలు లేని తల్లిదండ్రులకు వీరిని విక్రయిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 27 మందిని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

అయితే, చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా కార్తీక్‌ ఉండగా.. అజంపుర UPHCలో ఆశ వర్కర్‌గా అమూల్య పనిచేస్తోంది. మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో ఇస్మాయిల్‌ సూపర్‌వైజర్‌గా ఉన్నారు. ఇక, ఈ కేసులో దళారులతో పాటు పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వేల కిలోమీటర్లు బస్సుల్లో చిన్నారులను దళారులు తీసుకువస్తున్నారు.

కాగా, 25 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇప్పటికే 14 మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్టు తెలిపారు. మరో 11 మంది చిన్నారుల కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఆడ శిశువును మూడు లక్షలకు విక్రయించి నాలుగు లక్షలకు అమ్మకం.. మగ శిశువును నాలుగు లక్షలకు విక్రయించి ఆరు లక్షలకు అమ్మకం జరుపుతున్నట్టు గుర్తించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)