Breaking News

వస్త్రోత్పత్తుల నాణ్యతనూ గుర్తించొచ్చు..

Published on Thu, 01/30/2025 - 10:31

సాక్షి, హైదరాబాద్‌: వస్త్రోత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) హైదరాబాద్‌లో లే»ొరేటరీని ప్రారంభించింది. వస్త్రోత్పత్తుల నాణ్యత పరిశీలనకే ప్రత్యేకించిన ఈ లే»ొరేటరీని బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ బుధవారం ప్రారంభించారు. టెక్స్‌టైల్‌ రంగంలో నాణ్యతా పరీక్షల వాతావరణాన్ని అత్యాధునిక సాంకేతికత, వసతులతో ఏర్పాటైన ఈ లే»ొరేటరీ బలోపేతం చేస్తుంది. ‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్లను సరఫరా చేయడంలో ఈ లే»ొరేటరీ కీలకంగా పనిచేస్తుంది. టెక్స్‌టైల్‌ ఉత్పత్తులు జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునేలా చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. త్వరలో నూలును పరిశీలించే సౌలభ్యం కూడా అందుబాటులోకి రానుంది.

వస్త్రోత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు లే»ొరేటరీ ఏర్పాటైన ఇదే భవనంలో బంగారం నమూనాల స్వచ్ఛతను పరిశీలించే ప్రయోగశాల కూడా ఉంది. ఈ లే»ొరేటరీలో ఏర్పాటు చేసిన యూనివర్సల్‌ టెస్టింగ్‌ మెషీన్‌ (యూటీఎం) పరికరం ద్వారా వస్త్రోత్పత్తుల నాణ్యత, మన్నికను పరిశీలిస్తారు’అని తివారీ వెల్లడించారు. కార్యక్రమంలో బీఐఎస్‌ డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ (లేబొరేటరీస్‌) నిషత్‌ సుల్తానా, దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మీనాక్షి గణేశన్, హైదరాబాద్‌ బ్రాంచ్‌ ల్యా»ొరేటరీ హెడ్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎలా పనిచేస్తుంది...

యూనివర్సల్‌ టెస్టింగ్‌ మెషీన్‌లో వస్త్రాలకు ఉపయోగించే దారానికి కంట్రోల్డ్‌ టెన్సిల్‌ ఫోర్స్‌ను వినియోగిస్తారు, ఈ దారం తెగే వరకు లాగుతారు. ఎక్కడైతే దారం తెగుతుందో.. వినియోగించిన బలాన్ని లెక్కించి ఎంత నాణ్యమైందో రూఢీ చేసుకుంటారు. దీని ఆధారంగా మన్నిక, నాణ్యతను గుర్తిస్తారు.   

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)