హైదరాబాద్‌లో దారుణం.. గోడకేసి కొట్టి.. ఐదు కుక్క పిల్లలను కిరాతకంగా..

Published on Thu, 04/17/2025 - 17:00

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఐదు కుక్క పిల్లలను గోడకేసి కొట్టి చంపేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, సైకోగా మారిన ఆ వ్యక్తిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. ఫతేనగర్‌లో ఇండిస్ అపార్టుమెంట్‌ దగ్గర ఓ వీధి కుక్క ఐదు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అక్క‌డే ఉన్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఆ కుక్క పిల్ల‌లు ఉంటున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో నివశించే అశీష్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కతో రోజూ బయటకు వెళ్లే క్రమంలో ఆ కుక్కపిల్లలు దగ్గరకు వచ్చేవి. దీంతో ఓ కుక్క పిల్లను గోడకేసి బలంగా కొట్టగా.. అది రక్తం కక్కుకుని కింద పడిపోయింది. బతికిందో లేదో తెలుసుకోవడానికి మరోసారి గట్టిగా కొట్టాడు.. ఇలా మొత్తం ఐదు కుక్క పిల్లలను దారుణంగా చంపేశాడు.

కుక్క పిల్ల‌లు చ‌నిపోయి ఉండ‌డంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు.. ఈ క్ర‌మంలో అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా, అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యాపారి ఆశిష్ ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తేలింది. ఖాన్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జంతువులపై ఇంత కిరాతకంగా వ్యహరించిన వ్యక్తిని జైలుకు పంపించాలని కోరాడు.

ఆశిష్‌ను అపార్ట్‌మెంట్ వాసులు ప్ర‌శ్నించ‌గా.. ఆ కుక్క పిల్లలు తన పెంపుడు కుక్క దగ్గరకు వచ్చాయని.. అందుకే చంపేశానంటూ సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలో సైకోలు పెరిగిపోతున్నారని.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

 

 

 

 

 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)