Breaking News

టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు: సీఎం భగవంత్‌మాన్‌

Published on Wed, 01/18/2023 - 16:50

సాక్షి, ఖమ్మం:  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతీయ అబద్ధాల పార్టీగా మారిపోయిందని పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ విమర్శించారు. గుట్టలు, నదులు, ఫ్యాక్టరీలు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే, ఎల్‌ఐసీ ఇలా దేశం మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు. ఖమ్మం సభలో భగవంత్‌మాన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..  

‘‘మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ కూడా ఎర్రకోట మీద పంద్రాగస్టు ప్రసంగంలో నిరుద్యోగం, ఉగ్రవాదంపై చింతిస్తున్నానని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పటికైనా ప్రధాని ప్రసంగాన్ని మార్చాలి. నేను దేశాన్ని ప్రేమిస్తాను. బోకేలో రంగురంగుల పూలు ఉన్నట్టే.. దేశం రంగు రంగుల పూల సమాహారం. కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారు. బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రాల్లో బీజేపీ గెలవదు. ఆ పార్టీది లోక్‌తంత్ర కాదు.. లూటీ తంత్రం. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అన్నీ తమ కోసమే అన్నట్టు వ్యవహరిస్తోంది.  

పంజాబ్‌లో కంటి వెలుగు
ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో మొహల్లా క్లినిక్‌లు పెట్టాం. కంటి వెలుగు పథకం బాగుంది. ఇంత పెద్ద సభకు వచి్చన జనాన్ని చూసేందుకు పెద్ద కళ్లజోడు అద్దాలు ఉంటే ఇంకా బాగా చూసి ఆనందించేవాడిని. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్‌లో చేపడతాం. ఎమ్మెల్యేలను తక్కువ ధరకు అమ్మే పారీ్టగా కాంగ్రెస్‌ మారిపోయింది. గతంలో ఢిల్లీ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్‌ విమర్శలు చేసింది. ఆ తర్వాత ట్రంప్‌ సతీమణి మన దేశంలో స్కూళ్లను చూడాలనుకుంటే.. కేజ్రీవాల్‌ అభివృద్ధి చేసిన స్కూళ్లనే కేంద్రం చూపించింది. దేశం కోసం బ్రిటీష్‌ వాళ్లతో పోరాడి ప్రాణాలు అరి్పంచిన భగత్‌సింగ్‌ గుర్తుగా ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదం నినదించాలి. తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న కేసీఆర్‌కు అభినందనలు..’’ అని భగవంత్‌మాన్‌ పేర్కొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)