Breaking News

టైరు పేలి.. మంటలు చెలరేగి..

Published on Sat, 09/09/2023 - 02:11

మిర్యాలగూడ అర్బన్‌: నల్లగొండ జిల్లా మిర్యా­లగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్‌ బస్సును బుక్‌ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు.

శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్‌ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్‌ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్‌ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది.

ఎస్‌ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్‌ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు