Breaking News

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published on Wed, 12/25/2024 - 10:39

హసన్‌పర్తి: హనుమకొండ పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం ఆ కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్‌ తండాకు చెందిన గుగులోతు శ్రీదేవి(16) నగరంలోని డబ్బాల్‌ జంక్షన్‌ వద్ద గల ఏకశిలా గర్ల్స్‌ క్యాంపస్‌లో ఇంటర్‌ (ఎంపీసీ) ఫస్టియర్‌ చదువుతోంది. 

మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సదరు విద్యార్థి శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే హాస్టల్‌ గదిలో ఉరివేసుకుందని చెప్పారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు రాత్రి కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు. మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు. శ్రీదేవి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది.

గుండెపోటుతో ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌ మృతి

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.  ఫోన్‌ నెంబర్లు: 040-66202000 / 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)