Breaking News

విద్యార్థిపై ప్రిన్సిపల్‌ లైంగిక దాడి..!

Published on Thu, 07/09/2026 - 12:07

కొల్లాపూర్‌ (నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్‌ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్‌ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ మార్క్‌ పోలోనియస్‌. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. 



ఇదీ విషయం.. 
కొల్లాపూర్‌ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధుల నిర్వహిస్తున్న మార్క్‌ పోలోనియస్‌ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్‌ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. 

రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్‌ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్‌ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్‌ రూమ్‌ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్‌ ప్రైవేటు పార్ట్‌ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్‌ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్‌ కీచక పర్వాన్ని ఫోన్‌లో రికార్డు చేసి దాన్ని తీసుకొని విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  

పోలీసుల అదుపులో ప్రిన్సిపల్‌ 
లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటినుంచి పరారైన ప్రిన్సిపల్‌ మార్క్‌పోలోనియస్‌ కొల్లాపూర్‌లోని బొంగరాలమిట్ట ప్రాంతంలో గల ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకొని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.  

రిజిస్ట్రార్‌ ప్రకటనపై విస్మయం 
విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్‌ బాబు, ఓఎస్‌డీ మధుసూదన్‌రెడ్డి కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. రిజిస్ట్రార్‌ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపల్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కనీసం సస్పెండ్‌ కూడా చేయకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)