Breaking News

ధాన్యం.. దయనీయం

Published on Sat, 05/18/2024 - 05:41

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.

ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్‌ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి కరీంనగర్‌లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)