Breaking News

రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆధారాలతో వస్తాను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌

Published on Wed, 07/01/2026 - 22:00

గురుకులాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు గుప్పించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆధారాలతో పాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మంత్రులు వస్తారా? పారిపోతారా? తేలేది రేపే అని వ్యాఖ్యానించారు.

‘‘జీవో నం 17 చట్ట విరుద్దమంటూ హై కోర్టు మార్పులు చేయాలని సూచించినా,  ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది? కాంట్రాక్టుల్లో సెంట్రలైజ్డ్ పద్ధతిని ఎందుకు తెచ్చారు? స్థానికంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంట్రాక్టులు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ సంపద దోచి పెడుతున్నారు. 

మఫత్ లాల్ ఎవరు? ఆయనకు యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ కాంట్రాక్ట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులను మోసం చేసింది నిజం కాదా? నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? టోనీ అనే డ్రగ్ సప్లయర్, నిరంజన్ కుమార్ జైన్ కు ఏంటి సంబంధం? డ్రగ్స్ సప్లయ్ చేసే కంపెనీకి, ట్రంకు బాక్సుల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? 

రాజేశ్‌ అగర్వాల్ ఎవరు? షూ సప్లయ్ టెండర్ కాంట్రాక్ట్ అతనికి ఎలా ఇచ్చారు? తెలంగాణలో తోలు వ్యాపారం చేసే మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు ఎందుకు ఇవ్వలేదు? రూ.2,041 కోట్ల టెండర్లు ఖరారైనా ఇప్పటికీ విద్యార్థులకు ఎందుకు వస్తువులు అందడం లేదు? పిల్లలకు సప్లయ్ చేసే నోట్ బుక్ పేపర్ పై వాటర్ మార్క్ నిబంధన ఎలా వచ్చింది? కరెన్సీ పేపర్, రెవెన్యూ స్టాంప్ పేపర్లకు వాడే వాటర్ మార్క్... పిల్లల నోట్ బుక్స్ కి ఎందుకు? 

ఈ నిబంధన ఎవరి కోసం చేర్చారు? ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్ ఎందుకు? మా ఆరోపణల్లో అవాస్తవాలు ఉంటే గురువారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి,ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ అందరూ ఆధారాలతో వచ్చి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. కాంగ్రెస్ వస్తుందా? అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా తప్పిస్తుందా? చూద్దాం’’ అని చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)