ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు

Published on Sat, 03/23/2024 - 08:35

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా.. అదీ  మాజీ పోలీస్‌ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్‌రావు వెల్లడించిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది దర్యాప్తు చేస్తున్న స్పెషల్‌ టీం.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)