పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు అరెస్ట్‌

Published on Mon, 02/05/2024 - 21:10

హైదరాబాద్‌, సాక్షి: ప్రజాభవన్‌ రోడ్డు ప్రమాద కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్‌ చేశారు. గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

ప్రజాభవన్‌ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడు(ఏ11). బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను దుర్గారావే తప్పించినట్లు అభియోగం నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే నగర కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దుర్గారావును సస్పెండ్‌ చేసిన సంగతీ తెలిసిందే. అయితే.. విచారణకు హాజరు కాకుండా ఆయన పారిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తాజాగా.. గుంతకల్లు రైల్వే పోలీసుల సాయంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌వాహె, నిజామాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 

డిసెంబర్‌ 23న అర్ధరాత్రి షకీల్‌ తనయుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు పంపి కేసు నమోదు చేయించారు. ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)