Breaking News

హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఈవెంట్‌

Published on Sat, 11/22/2025 - 04:01

సాక్షి, హైదరాబాద్‌: పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌–2025 పేరుతో దక్షిణాసియాలోనే అతి పెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు హాజరు కానున్న ఈ ఎగ్జిబిషన్‌ను నవంబర్‌ 25 నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. ఇండియన్‌ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సస్టెయినబుల్‌ ఫీడ్‌ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు..ఎరువుల నిర్వహణ, భవిష్యత్‌ ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై ఈ ఎగ్జిబిషన్‌లో చర్చ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

కాగా ఈ ఈవెంట్‌కు హాజరు కావాల్సిందిగా..శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసిన పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌ సింగ్‌ బయాస్, కోశాధికారి శ్రీకాంత్‌తో పాటు చక్రధర్‌రావు, వెంకటేశ్వరరావు, కేజీ ఆనంద్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె.మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.నరసింహారెడ్డి, జీకే మురళి తదితరులు సీఎంను కలిశారు.  

వన్‌ నేషన్‌–వన్‌ ఎక్స్‌పో: పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ మాట్లాడుతూ.. వికసిత్‌ భారత్‌ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు బాటలు వేసేలా వన్‌ నేషన్‌–వన్‌ ఎక్స్‌పో అనే థీమ్‌తో 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌లో 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్స్, 40 వేలకు పైగా సందర్శకులు పాల్గొంటారన్నారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి