Breaking News

HYD: 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Published on Sat, 12/30/2023 - 12:12

ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభు­త్వం కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్‌(నాన్‌ ఏసీ) బస్సులను హైదరాబాద్‌ ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నంప్రభాకర్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలోరవాణా, రహదారి, భవ­నాల­శాఖ కార్యదర్శి  శ్రీనివాసరాజు, రవాణా­శాఖ కమిష­నర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పాల్గొన్నారు.

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీలో మెరుగైన ప్రయాణం కోసం కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. నేడు 80 బస్సులు ప్రారంభించామని, త్వరలో మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మే జూన్ కల్ల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి  వస్తాయన్నారు. రూ. 400 కోట్లతో ఈ కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణం తీసుకొచ్చిందన్న సజ్జనార్‌.. ఈ 21 రోజుల్లో  మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసి సిబ్బంది ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. వచ్చే రోజుల్లో ఓపికతో ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇప్పటికీ ఆరు కోట్ల ఉచిత టికెట్‌లు విక్రయించినట్లు తెలదిపారు. కండక్టర్, డ్రైవర్లకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు. 

ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని, బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేoదుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పురుష ప్రయాణికుల  విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి  చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

రూ. 400 కోట్లతో 1,050 కొత్త బస్సులు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైనసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్‌ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్‌ప్రెస్, 512 పల్లెవెలుగు, 92 లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు న్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలను హైదరాబాద్‌ సిటీలో 540, జిల్లాల్లో 500 బస్సులను కూడా అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ విడతల వారీగా  వచ్చే మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్‌ చేసింది.  

లీజుకు ఆర్టీసీ భూములు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని టీఎస్‌ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు  ఈ-టెండరు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించింది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.  టెండర్లకు  వచ్చే ఏడాది జనవరి 18 చివరి తేదీగా పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)