Breaking News

కుప్పకూలిన వ్యవస్థకు గట్టి పునాది వేస్తున్నాం

Published on Thu, 12/04/2025 - 01:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో కి వచ్చే నాటికి రెవెన్యూ వ్యవస్థ కుప్ప కూలి పోయి ఉందని, దాన్ని పునాదుల నుంచి మళ్లీ నిర్మించుకుంటూ వస్తున్నామని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కొంచెం ఆలస్యమైనా రెవెన్యూ వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తామన్నారు. రైతులు తమ భూమి గురించి భయపడే దశ నుంచి పూర్తి భద్రత కల్పిస్తూ వారిలో ధైర్యం నింపగలిగామని వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కమిషనర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేసి ప్రజలు మెచ్చిన భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. 

భూదార్‌ కార్డులిస్తాం: రెండో దశలో భాగంగా నక్షాలు లేని 373 గ్రామాల్లో సర్వే చేసి భూముల హద్దులు నిర్ధారించి భూదార్‌ కార్డులిస్తామని పొంగులేటి చెప్పారు.  మూడో దశలో ప్రతి జిల్లాలోని 70 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మొత్తం 3,490 మంది లైసెన్సుడు సర్వేయర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, మరో 2,500 మందిని డిసెంబర్‌ చివరి కల్లా అందుబాటులోకి తెస్తామన్నారు. అతుకుల బొంత ధరణి వెబ్‌సైట్‌ను రూపుమాపి, భూముల వివరాలు, సర్వే సమాచారం, రిజిస్ట్రేషన్‌ గణాంకాలు ఒకే వేదికపై ఉండేలా ఏకీకృత వెబ్‌సైట్‌ను వచ్చే జనవరిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

అన్ని భద్రతా ప్రమాణాలుండే భూదార్‌కార్డులను రైతులకు ఇస్తామని, భవిష్యత్తులో ఏ రిజిస్ట్రేషన్‌ లావాదేవీ అయినా సర్వే మ్యాప్‌ ఉంటేనే జరిగేలా పారదర్శక వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. అయితే కంగారు పడి ప్రజలను మభ్యపెట్టాలని తమకు లేదని, కొంత ఆలస్యమైనా చెప్పిన దాని కంటే ఒకటి ఎక్కువే చేస్తామని పొంగులేటి వెల్లడించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల విషయంలో స్పందిస్తూ.. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం మారదు. మార్చబడదు’ అని చెప్పారు.

పొంగులేటి ఇంకా ఏం చెప్పారంటే...!
⇒ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా నోటీసుల జారీ అయిపోయింది. త్వరలోనే పరిష్కార ప్రక్రి య ప్రారంభమవుతుంది. ఇందులో అఫిడవిట్‌ ఇవ్వాలన్న నిబంధనపై కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవసరమైతే జీవోను మార్చేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

⇒ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల అవకతవకలపై తాము చేసిన ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ ప్రక్రియ పైలట్‌ జిల్లాలైన సిద్ధిపేట, సిరిసిల్లలో ముగిసింది. ఈ నివేదికను త్వరలోనే వెల్లడిస్తాం. 
⇒ నిషేధిత భూముల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టాం. ఎవరికైనా అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలించి అవసరమైతే ఆయా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. 

⇒ ఒకసారి ఒక భూమిని రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్రానికి లేదు. కేంద్ర చట్టాన్ని మార్చి ఆ అధికారాన్ని ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని అడిగాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
⇒ హిల్ట్‌పిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏ పరిశ్రమలకు ఎలా భూములను ధారాదత్తం చేశారనే విషయాలను త్వరలోనే తెలియజేస్తాం. 

⇒ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 45–46 వేల మందికి అక్రిడిటేషన్లు జారీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. 
⇒ తెలంగాణ పేరుతో రెండుసార్లు బీఆర్‌ఎస్‌ మసిపూసి మారేడు కాయ చేసింది. పడికట్టు పదాలతో ప్రజలను మోసం చేసింది. ఇకముందు కూడా అలాంటిది నడుస్తుందనుకోవడం వారి పొరపాటు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)