Breaking News

టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి

Published on Sat, 07/15/2023 - 01:19

సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో పొంగులేటికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ కండువా కప్పిన విషయం తెలిసిందే. కాగా టీపీసీసీ ప్రచార కమిటీకి గతంలో చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్, కన్వీనర్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీలను అదే పదవుల్లో కొనసాగించారు. ఇక ప్రచార కమిటీలో 37 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా నియమించారు.

కార్యనిర్వాహక సభ్యులు వీరే.. 
టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, ఎం.ప్రవీణ్‌ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్, మహ్మద్‌ జావేద్‌ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్, జూలూరు ధనలక్ష్మి గౌడ్, దయాకర్‌ గౌడ్, వరంగల్‌ రవి, నాగన్న, అముగోతు వెంకటేశ్, రాములు యాదవ్, దాస్‌గౌడ్, కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి, గడుగు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేశ్, దినేశ్‌ సాగర్‌ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, శ్రీకొండ మల్లేష్, కోట శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్, చారులత రాథోడ్, రేణుక, గిరి నాగభూషణం, భీం భరత్, కె.శివ కుమార్, సాయిని రవి, రఘువీర్‌ గౌడ్, డా.కె.విజయ్‌కుమార్, జి. లోకేశ్‌ యాదవ్, ఏఎం ఖాన్, జంగారెడ్డి, డా. వడ్డేపల్లి రవి, తాటికొండ శ్రీనివాస్, డా. మోతీ లాల్‌ను కార్యనిర్వాహక సభ్యులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అవకాశం కల్పించారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా...
వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్‌ నేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)