Breaking News

అవసరాలకు అప్పు ఇ‍చ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..

Published on Fri, 04/18/2025 - 10:20

మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. 

ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్‌ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్‌ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. 

కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్‌ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్‌ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు.

 ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని  సీఐ అభినందించారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)