Breaking News

గాంధీభవన్‌, ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత..

Published on Sat, 10/07/2023 - 14:50

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్‌ నేతుల నిరసనలు తెలిపారు.

డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్‌ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్‌ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

మరోవైపు.. ఇందిరా పార్క్‌ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్‌ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్‌ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్‌ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్‌ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్‌ చేయాలని ఏఎన్‌ఎంలు ఆందోళన చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్‌ అవుతుంది: హరీష్‌ రావు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)