Breaking News

ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష

Published on Fri, 10/11/2024 - 05:11

కామారెడ్డి టౌన్‌: మొబైల్‌ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్కానింగ్‌ సెంటర్‌లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్‌ కావడంతో రవీందర్‌ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.

వాస్తవానికి అతనికి స్కానింగ్‌ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్‌ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్‌ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.

ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్‌ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్‌ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి