Breaking News

సికింద్రాబాద్‌ బచావోకు బ్రేకులు.. తెలంగాణ భవన్‌ వద్ద హైడ్రామా

Published on Sat, 01/17/2026 - 11:02

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ సర్కార్‌ సికింద్రాబాద్‌ పేరును మార్చేసి పెద్ద కుట్రకు తెర తీస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇవాళ చేపట్టాల్సిన సికింద్రాబాద్‌ బచావో ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఉదయం నుంచే బీఆర్‌ఎస్‌ నేతల్ని ఎక్కడికక్కడే నిలువరిస్తున్న పోలీసులు.. ఈ ఉదయం తలసానిని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

బీఆర్‌ఎస్‌ ర్యాలీ నేపథ్యంలో.. జంట నగరాల్లోని నేతలను పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. పలువురిని గృహ నిర్భందం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ భవన్‌ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్‌ నుంచి ఎంజీరోడ్డు దాకా సికింద్రాబాద్‌ బచావో పేరిట శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో ర్యాలీ చేయాలనుకున్నాం. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. అయితే లష్కర్ సాధన సమితికి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు. నిన్ననే సమాచారం అందించి ఉంటే.. కోర్టుకు వెళ్లేవాళ్లం. 

మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారు. మాకు సికింద్రాబాద్‌తో ఉన్నది మట్టి సంబంధం. ఇప్పటికే వేల మందిని అరెస్ట్‌ చేశారు. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి తీరతాం అని తలసాని అన్నారు. 

తలసానిని బయటకు పోనివ్వకుండా.. 
తెలంగాణ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం తలసాని బయటకు వచ్చారు. అయితే ఆయన్ని ఎటూ పోనివ్వకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. తాను ఇంటికి వెళ్తానని తలసాని చెప్పినా పోలీసులు వినలేదు. తమ వాహనంలో దిగబెడతామంటూ ఆయన చెప్పారు. దీంతో ఆయన మళ్లీ తెలంగాణ భవన్‌లోకే వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)