Breaking News

అభివృద్ధి మంత్రం.. రాజకీయ తంత్రం

Published on Sun, 11/13/2022 - 00:29

రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ఓ వైపు అధికార టీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శలతో రాజకీయ అస్త్రాలు సంధిస్తూనే.. మరోవైపు అభివృద్ధి మంత్రాన్ని బలంగా చాటుతూ ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేయడంతోపాటు.. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు చరమగీతం పాడే దిశగా ముందుకు సాగాలని పార్టీ కేడర్‌కు మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందనీ చెప్పారు.

ఇదే సమయంలో కేంద్రంపై, తనపై, బీజేపీపై చేస్తున్న రాజకీయ దాడు­లకు తగినరీతిలో సమాధానం చెప్తామ­న్నా­రు. రాబోయే రోజుల్లో యుద్ధం రసవత్తరం కాబోతోందంటూ రాజకీయపర­మై­న హెచ్చ­రికలూ చేశారు.

మూఢ నమ్మకాలను విమర్శిస్తూ..
గతంలో ఐఎస్‌బీ స్నాతకోత్సవం కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్‌ఎస్‌ సర్కార్, ప్రభుత్వ అధినేతపై సునిశిత విమర్శలు చేయడంతోపాటు మూఢ నమ్మకాలను నమ్ముకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తాజాగా శనివారం బేగంపేట సభలోనూ మూఢ నమ్మకాల అంశాన్ని లేవనెత్తారు. గవర్నమెంట్‌ ఆఫీసులు ఎక్కడుండాలి, ఎలా ఉండా­లన్న విషయంలోనూ మూఢ నమ్మకా­లను పాటించడం బాధాకరమన్నారు.

రామగుండం సభలో ఒకవైపు కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావి­స్తూనే.. సింగరేణిని ప్రైవేటీకరిస్తు­న్నారంటూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకునే దిశలో పరుగులు పెడుతోందని.. నిర్దేశించుకున్న లక్ష్యాలు పెద్దవైనందున కేంద్రం నూతన పోకడలతో ముందుకు సాగుతోందని రామగుండంలో అభివృద్ధి మంత్రం జపించారు.

ప్రజలు ఆశీర్వదించాలంటూ..
గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాజకీయాలకు అతీతంగా చాలా చేశామని.. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వా­లు­న్నాయా, ప్రతిపక్ష సర్కార్లున్నాయా అన్న పక్షపాతం లేకుండా అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో కేంద్రం సాయంతో వచ్చిన ప్రగతే దీనికి నిదర్శనమంటూ ఆకట్టుకున్నారు. తెలంగాణను అభివృద్ధిపథంలో మరింత ముందుకు తీసుకెళతామని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.  

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు