Breaking News

Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు

Published on Thu, 03/14/2024 - 11:36

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) ప్రణీత్‌ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్‌ ట్యాపింగ్‌లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్‌ టీం భావిస్తోంది.

‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ పెద్దల ఫోన్లను ట్యాప్‌ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్‌ఐబీ చీఫ్‌ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్‌ ఛాటింగ్‌లపై నిఘా పెట్టాను..

.. ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను.  అప్పటి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్‌ఫోన్లు, హార్డ్‌ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 

దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌ మీద చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్‌ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)