Breaking News

HYD: పవన్‌కల్యాణ్‌పై సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌

Published on Mon, 10/14/2024 - 16:51

సాక్షి,హైదరాబాద్‌: తిరుపతి లడ్డూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేశారని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం(అక్టోబర్‌ 14)ఈ పిటిషన్‌ వేశారు. 

‘హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఏవీ లేకుండా తిరుపతి లడ్డూలో జంతుమాంసంతో చేసిన నెయ్యి కలిసిందని పవన్‌ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ తన హోదా మరచి  వివాదస్పద వాఖ్యలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టింది. ఇంటర్నెట్‌లో పవన్‌ మాట్లాడిన వీడియోలు డిలీట్‌ చేయాలి. 

తిరుపతి లడ్డూ వివాదంలో సమగ్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇప్పటికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. మరోసారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి’అని పిటిషనర్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.ఈ పిటిషన్‌ను సిటీ సివిల్‌ కోర్టు మంగళవారం విచారించనుంది.

ఇదీ చదవండి: జనం లేని పవన్‌ పల్లె పండుగ సభ 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)