Breaking News

కేటీఆర్‌ ధర్నాకు అనుమతి నిరాకరణ!

Published on Thu, 11/21/2024 - 04:12

మహబూబాబాద్‌ రూరల్‌: ‘లగచర్ల’గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో బీఆర్‌ఎస్‌ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మహాధర్నాకు అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయతి్నస్తున్నాం. తొలుత అనుమతి ఇస్తామని పోలీసులు చూచాయగా చెప్పారు. తీరా ఎస్పీ అనుమతి ఇవ్వలేమంటూ నిరాకరించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ పిరికి పంద చర్య’’అని నేతలు మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా ఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి చివరి నిమిషంలో అనుమతి ఇవ్వబోమని చెప్పటం ఏమిటని నిలదీశారు. 

ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించలేమని, పోలీసులు చెప్పటం చూస్తే వారి దుస్థితి ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగినా... పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ ధర్నాలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మార్నేని వెంకన్న, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)