Breaking News

చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి

Published on Thu, 09/07/2023 - 03:07

కెరమెరి(ఆసిపాబాద్‌): కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్‌ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు.

చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్‌ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు.

అనంతరం ముగ్గురూ కెరమె­రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్ప­టికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్‌ వాసులు వాపోతున్నారు.
చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)