అర్ధరాత్రి నగ్నంగా వెళ్లి.. గుడిలో విగ్రహం తీసుకుని..

Published on Sun, 07/19/2026 - 08:12

మేడిపల్లి: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గణపతినగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన వకలగాడి తేజస్విని (27) మూడు నెలలుగా తల్లి అరుణతో కలిసి శంకర్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఆమె తండ్రి ఈశ్వర్‌రావు విశాఖ పట్నంలో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా బయటకి వెళ్లిన తేజస్విని.. సమీపంలోని బీరప్ప ఆలయం లోపలకు వెళ్లింది. అనంతరం ఆలయంలోని విగ్రహం తీసుకునివెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం యువతి మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లి ఫిర్యాదుతో కేసు న మోదు చేశారు. తేజస్విని గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, యువతి తీసుకెళ్లిన విగ్రహం కోసం హైడ్రా బృందం ప్రత్యేక పరికరాలతో చెరువులో ముమ్మరంగా అన్వేషణ సాగిస్తోంది. 

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)