Breaking News

అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..

Published on Fri, 08/25/2023 - 12:57

సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై  2022లో లూనార్ రిజిస్ట్రేషన్  ద్వారా  దరఖాస్తు చేసుకుంది.

ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్  వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.  

ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్‌ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి.
చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్‌ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు

చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్‌ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు.

మరోవైపు చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్‌ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్‌ జీవితకాలం ఒక లూనార్‌ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్‌ ప్రజ్ఞాన్‌ ల్యాండింగ్‌ సైట్‌ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్‌ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)