Breaking News

ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్‌ ఏఈ

Published on Wed, 07/15/2026 - 07:48

పెద్దపల్లి రూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని మున్సిపల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) కల్లెపల్లి సతీశ్‌కుమార్‌ మంగళవారం తన ఇంట్లో బత్తుల శ్రీనివాస్‌ అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

శ్మశానవాటికలు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైనల్‌ బిల్లు రూ.12,28,748 కాంట్రాక్టర్‌కు విడుదల చేసేందుకు సతీశ్‌ రూ.4 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పినా.. ఇవ్వాల్సిందేనని చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వారి సూచన మేరకు రూ.2 లక్షలను మంగళవారం కాంట్రాక్టర్‌ బత్తుల శ్రీనివాస్‌ పట్టణ శివారు రంగంపల్లిలోని ఏఈ సతీశ్‌ ఇంట్లో ఇస్తుండగా డీఎస్పీ మహేందర్‌రెడ్డి సారథ్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

సోదాల్లో లెక్కతేలని రూ.32 లక్షలు.. 
సతీశ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కగా.. అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కతేలని రూ.32,31,900 విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని కూడా అధికారులు సీజ్‌ చేశారు. అయితే ఆ డబ్బు భూమి అమ్మగా వచ్చిందని ఏఈ చెబుతున్నారని, అందుకు ఆధారాలు సమరి్పంచి తిరిగి పొందొచ్చని డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలోనూ రికార్డులను పరిశీలించారు. సతీశ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్టు డీఎస్పీ వివరించారు. 

 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)