Breaking News

Gandhi Hospital: ఓపీకి వస్తే బీపీ తప్పదు

Published on Tue, 09/27/2022 - 09:41

సాక్షి, హైదరాబాద్‌: గాంధీఆస్పత్రి అవుట్‌ పేషెంట్‌ విభాగానికి రోగులు పోటెత్తారు. నగర నలుమూలలతోపాటు పలు జిల్లాలకు చెందిన బాధితులు వైద్యసేవల కోసం సోమవారం పెద్దసంఖ్యలో తరలిరావడంతో కంప్యూటర్‌ చిట్టీలు మొదలుకొని వైద్యపరీక్షలు, స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, చివరకు మందుల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఓపికి వస్తే బీపీ తప్పలేదని, ఉన్న రోగం వదిలించుకునేందుకు వస్తే కొత్తరోగాలు అంటుకుంటున్నాయని పలువురు బాధితులు వాపోతున్నారు.

ఓపీ చిట్టీ కౌంటర్ల సంఖ్య పెంచాలనే నిర్ణయం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈవినింగ్‌ ఓపీ సేవలు ప్రారంభమైనప్పటికీ ఉదయం పూట వచ్చేందుకే రోగులు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మార్నింగ్‌ ఓపీకి రద్దీ పెరిగిందని ఆస్పత్రి అధికారి వ్యాఖ్యానించారు. గాంధీ ఓపీ విభాగంలో సోమవారం సుమారు మూడున్నర వేల మందికి వైద్యసేవలు అందించారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు, వసతి సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు.  
చదవండి: నగరాన్ని ముంచెత్తిన జోరు వాన..  వరద నీటిలో చిన్నారుల ఈత

Videos

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)