Breaking News

పార్టీ పరిశీలకులు గ్రామాలకు వెళ్లాలి

Published on Thu, 06/05/2025 - 01:19

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలందరూ గ్రామాలకు వెళ్లాలని, కార్యకర్తలకు భరోసా కల్పించే దిశలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుధవారం గాం«దీభవన్‌లో ఆమె ‘జై భీమ్‌.. జై బాపూ.. జై సంవిధాన్‌’కార్యక్రమ సమన్వయకర్తలు, పీసీసీ పరిశీలకులతో సమావేశమయ్యారు. 

జిల్లాల వారీగా పరిశీలకులతో భేటీ తర్వాత ఆమె వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం గురించి ఆమె.. నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పరిశీలకులు బాధ్యతగా పనిచేయాలని, మండల కమిటీలను ఎంపిక చేసే ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోని 5 గ్రామాలను యూనిట్‌గా చేసి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రతి యూనిట్‌కు ఒకరు చొప్పున మండల కమిటీలోకి తీసుకోవాలని చెప్పారు. 

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల్లో నామినేటెడ్‌ పోస్టులకు అర్హులెవరన్న దానిని గుర్తించాలని సూచించారు. జై బాపూ, జై భీమ్‌.. కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని చెప్పిన ఆమె, సమన్వయకర్తలకు రాహుల్‌ గాంధీ పక్షాన ప్రశంసలు తెలియజేశారు.  

ఫోన్‌ చేసి మాట్లాడిన మీనాక్షి 
సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ కమిటీల నియామకం ఎంత వరకు వచ్చిందన్న అంశాన్ని మీనాక్షి నటరాజన్‌ ఆరా తీశారు. పరిశీలకులు సమర్పించిన నివేదికలు చూసిన ఆమె, బాగా పనిచేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కమిటీల నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న నివేదికల మేరకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఓ ఎమ్మెల్సీకి ఆమె నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. పార్టీ కమిటీల నియామకాలను వాయిదా వేయవద్దని వారికి సూచించారు.  

మంత్రితో ముఖాముఖి 
కాగా, బుధవారం గాం«దీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’కా­ర్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దాదాపు మూడు గంటల పాటు గాం«దీభవన్‌లో ఉండి ప్రజల నుంచి వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 100కు పైగా వినతిపత్రాలు వచ్చాయని, తక్షణమే పరిష్కరించగలిగిన వాటిపై అధికారులతో అప్పటికప్పుడే మాట్లా­డి పరిష్కరించారని, మిగిలినవి ఆయా శాఖలకు పంపామని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, కరెంటు బిల్లులు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రజ­లు దరఖాస్తులిచ్చారని తెలిపారు. కాగా, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ కూడా మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజ­ల సమస్యలను అడిగి తెలు­సు­కున్నారు. తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)