Breaking News

బతికి ఉన్న కుమార్తెకు శ్రద్ధాంజలి

Published on Sun, 08/31/2025 - 04:23

ఇల్లెందు రూరల్‌: కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో యువతి బతికి ఉండగానే కు­టుంబ సభ్యులు శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు కట్టారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొజ్జా­యి­గూడెంకు చెందిన కొచ్చర్ల వెంకటేశ్, కుంజ సింధు ప్రేమించుకుంటున్నారు. వీరి­ద్దరి­కీ తండ్రులు లేరు. వెంకటేశ్, సింధు వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆపై కు­టుంబీకుల నుంచి రక్షణ కల్పించాలని పోలీ­సులను ఆశ్రయించడంతో వారు కౌ­న్సె­లింగ్‌ ఇచ్చారు. ఆపై వెంకటేశ్, సింధు గ్రామంలోని సమీప బంధువుల ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్నారు.

 వెంకటేశ్‌పై పో­లీసు కేసు ఉన్న విషయం తెలియడంతో సింధు తల్లి నాగమణి కుమా­రులతో కలిసి భర్త లేని సమయంలో సింధుకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సింధును ప్రశ్నించడంతో తల్లితోనే ఉంటానని చెప్పింది. వెంకటేశ్‌ మాత్రం అదే విషయం సింధు తన ముందు చెప్పాలని పేర్కొనగా గ్రామ పెద్దమనిషి ఒకరు సింధును వెంకటేశ్‌ వద్దకు తీసుకెళ్లగానే ఆమె భర్తతోనే ఉంటానని చెప్పడంతో సింధును పోలీసులు వెంకటేశ్‌కు అప్పగించారు. దీంతో సింధు తల్లి, సోదరులు మనోవేదనకు గురై ఆమె చనిపోయినట్లుగా పేర్కొంటూ శనివారం గ్రామంలోని వీధుల్లో శ్రద్ధాంజలి ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)