పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..

Published on Tue, 12/26/2023 - 17:51

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాభవన్‌ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్‌ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

సోహైల్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్‌ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్‌ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్‌ నుంచి షకీల్‌ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది.

మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి ఫోన్‌ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

కాగా షకీల్‌ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్‌ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్‌ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్‌ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్‌ కొడుకు సోహైల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ష​కీల్‌ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసింది షకీల్‌ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్‌ ఎవరు? పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)