Breaking News

బీసీల వాటా 31.4%

Published on Thu, 01/15/2026 - 02:43

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్‌పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్‌ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్‌ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్‌ 14 జారీ చేశారు. 


మున్సిపల్‌ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్‌ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం జనరల్‌ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్‌ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్‌ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు మేయర్‌ పదవులు దక్కనున్నాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)