Breaking News

ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం 

Published on Mon, 10/24/2022 - 08:52

సాక్షి, మునుగోడు: టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది.

‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్‌ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు.  

రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. 
మంత్రి సత్యవతి రాథోడ్‌ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్‌ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు.  
 

Videos

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)