Breaking News

విషాదం: ఓయూ మాజీ వీసీ నవనీత రావు కన్నుమూత

Published on Sat, 08/26/2023 - 12:29

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్‌ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు (95) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు.

అయితే, నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన పని చేశారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక, ఆయన మృతిపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. న‌వనీత రావు డైన‌మిక్ అడ్మినిస్ట్రేట‌ర్ అని ఆయ‌న కొనియాడారు. ఓయూ గౌర‌వాన్ని పెంచ‌డ‌మే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాల‌ను కూడా తీర్చిదిద్దార‌ని పేర్కొన్నారు. 

నవనీత రావు మృతిపై దాసోజు శ్రవణ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప‌రిపాల‌న‌లో రాజ‌కీయ జోక్యాల‌కు తావు ఇవ్వ‌కుండా, స్వ‌యం ప్ర‌తిప‌త్తిని కొన‌సాగించార‌ని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం త‌న‌కు ద‌క్కింద‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. న‌వనీత రావు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని శ్ర‌వ‌ణ్ ప్రార్థించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)