Breaking News

‘మాక్‌’తో మేల్కొలుపు

Published on Mon, 07/14/2025 - 01:09

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ మాక్‌ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. 

ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 

2 వేల ర్యాంకుకూ సీటు రాలే..
మాక్‌ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశారు. 

ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్‌సెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్‌ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్‌ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్‌ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.

జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి
ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్‌ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్‌సెట్‌ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. 

మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్‌ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్‌లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)