Breaking News

ఆన్‌లైన్‌ ఆఫర్ల పేరిట బురిడీ!

Published on Sat, 10/05/2024 - 06:20

సాక్షి, హైదరాబాద్‌: పండుగల ఆఫర్లు, గిఫ్ట్‌ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్‌లైన్‌ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్‌ ఆఫర్‌ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్‌లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్‌ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్‌ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఈ లాజిక్‌ మిస్సవ్వొద్దు..
షాపింగ్‌ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్‌ మాల్‌ కూడా గిఫ్ట్‌ కూపన్‌ లేదా ఫ్రీ గిఫ్ట్‌ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్‌ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్‌ చేస్తే వెంటనే ఫోన్‌లోకి మాల్‌వేర్‌ వైరస్‌ ఇన్‌స్టాల్‌ కావడంతోపాటు ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.

ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..
⇒  ప్రముఖ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లను పోలినట్లుగా ఫేక్‌ వెబ్‌సైట్లు సృష్టించి మోసాలు. సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఫేక్‌ ఆఫర్‌ మెసేజ్‌లు.
⇒  ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌తో, ఎస్‌ఎంఎస్‌లతో మోసాలు. 
⇒  ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపి అందులోని లింక్‌లపై క్లిక్‌ చేయాలని సూచనలు. 
⇒ పండుగ సీజన్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి పాయింట్స్‌ గెలవాలంటూ నకిలీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ లింక్‌లతో సందేశాలు.  

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)