Breaking News

ఉద్యోగాల ఎర.. ‘సైబర్‌’ వెట్టిలో చెర!!

Published on Mon, 02/17/2025 - 04:37

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: చైనా స్కామ్‌స్టర్లు ఆన్‌లైన్‌లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్‌ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

విమాన టికెట్‌ పంపి మరీ..
కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం’ అంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. 

ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్‌ అందడంతో గతేడాది డిసెంబర్‌ 18న బ్యాంకాక్‌ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్‌ నేరగాళ్లు ఆయన్ను సైబర్‌ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.

గత్యంతరం లేకపోవడంతో..
అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్‌ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్‌) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. 

అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్‌స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్‌ మయాంగ్‌ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్‌ మయాంగ్‌కు, థాయ్‌లాండ్‌ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.

కాపాడాలని వేడుకోలు..
అక్కడికి వెళ్లాక సైబర్‌ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్‌ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్‌ కాల్‌ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 

ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)