Breaking News

పెళ్లి మంటపంలో కుప్పకూలిన వధువు తండ్రి

Published on Sat, 02/22/2025 - 08:39

భిక్కనూరు(హైదరాబాద్‌): మంగళ వాయిద్యాలు మోగుతుండగా వేదపండితులు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి మంటపానికి చేరుకున్నారు. అల్లుడు, కూతురు కాళ్లు కడిగిన వధువు తండ్రి ఆనందంగా అందరినీ పలకరిస్తున్నారు. మరోవైపు భోజనాలు కూడా మొదలయ్యాయి. ఇంతలోనే ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన కుడిక్యాల బాల్‌చంద్రం (55) కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో నివసిస్తున్నారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. 

ఆయనకు భార్య రాజమణి, కూతుళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి ఉన్నారు. పెద్ద కూతురు కనకమహాలక్ష్మి పెళ్లి కుదిరింది. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్‌ చౌరస్తా వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులను బాల్‌చంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్న కూతురు పెళ్లి కూడా చేస్తానని చాలా మందితో బాల్‌చంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బాల్‌చంద్రంను వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. కూతురు పెళ్లిలో తండ్రి కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పెళ్లి కోసం వేసిన పందిరిలో విగతజీవిగా పడిపోయిన తండ్రిని చూసి ఆ కూతురు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో బాల్‌చంద్రం అంత్యక్రియలు నిర్వహించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)