Breaking News

అత్తతో అల్లుడి అనైతిక బంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ

Published on Mon, 03/17/2025 - 08:06

జడ్చర్ల(మహబూబ్‌నగర్): వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కమలాకర్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.

అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్‌కుమార్‌తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్‌నగర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్‌కుమార్‌ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. 

చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)