Breaking News

పాతబస్తీ మెట్రో విస్తరణలో.. మరో ముందడుగు..

Published on Wed, 03/19/2025 - 08:06

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీ మెట్రో విస్తరణలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చెక్కులను పంపిణీ చేశారు. రోడ్డు  విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన బాధితులకు రూ.200 కోట్లకు పైగా పరిహారం  
అందజేశారు. చదరపు గజానికి రూ.81 వేల నుంచి రూ.లక్ష చొప్పున  స్థలానికి ఖరీదు చెల్లించడంతో పాటు పునరావాసం కోసం పరిహారం కూడా చెల్లించినట్లు  అధికారులు తెలిపారు. రంజాన్‌ మాసం దృష్ట్యా కూలి్చవేత పనులను నెమ్మదిగా కొనసాగిస్తున్నప్పటికీ.. విస్తరణ కోసం గుర్తించిన ఆస్తులకు నోటీసులు ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. 8 నెలల్లో మొత్తం పనులను పూర్తి చేసి మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌) లక్ష్యంగా పెట్టుకొంది.  

అతిపెద్ద కారిడార్‌.. 
మెట్రో రెండో దశలోని మొదటి ఐదు లైన్‌లను నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండో దశలో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీ మెట్రో పనులు  కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే ప్రధానమైన పనులను  చేపట్టేందుకు అనుగుణంగా ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై దృష్టి సారించారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సంగతి  తెలిసిందే. దీంతో జేబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్‌ కారిడార్‌ అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్‌– చాంద్రాయణగుట్ట వరకు 11,00 ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 980 నిర్మాణాలను మాత్రం తొలగించాల్సి ఉంది. ఆస్తుల సేకరణకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. 

కూలి్చవేత పనులు వివిధ దశల్లో.. 
భూ సేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు  హెచ్‌ఏఎంఎల్‌  చర్యలు చేపట్టింది. మెట్రో నిర్మాణంలో మతపరమైన, ఆధ్యాతి్మక కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివాసాలు, దుకాణాలు వంటివి మాత్రమే తొలగించనున్నారు. ఈ మేరకు గుర్తించిన 980 నిర్మాణాల్లో 400 నిర్మాణాలకు ప్రాథమిక నోటీసులు అందజేశారు. 325 మంది నుంచి ఆమోదం లభించింది. వాటిలో 216 ఆస్తులకు అవార్డు డిక్లేర్‌ చేశారు. ఇప్పటి వరకు 80 ఆస్తులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వీటిలో 39 నిర్మాణాల కూలి్చవేత పూర్తయిందని, మరో 41 నిర్మాణాల కూల్చివేతల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు  ఇప్పటి వరకు చెల్లించిన పరిహారంలో కొంత భూమి ఖరీదు కోసం కాగా, సుమారు 215 మందికి  పునరావాసం కోసం పరిహారం అందజేశారు.  

7.5 కిలోమీటర్లు.. రూ.2,714 కోట్లు.. 
మెట్రో రెండో దశలో మొదటి 5 కారిడార్‌లకు రూ.24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయినవారికి చెల్లించే  పరిహారం కాకుండా దాదాపు రూ.2,714 కోట్లు  ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. మెట్రో రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుందని, యువతకు  ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతుండగా.. ప్రస్తుతం వాణిజ్య ప్రాంతాల్లోని దుకాణాలు, భవనాలు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పలువురు పాతబస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, టీస్టాళ్లు, వివిధ రకాల వస్త్ర, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు వంటివి కూల్చివేతలకు గురి కానున్నాయి.  


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)