Breaking News

పాతబస్తీ మెట్రో పనులు షురూ

Published on Sun, 11/17/2024 - 03:44

సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణకు క్షేత్రస్థాయిలో పనులు  మొదలయ్యాయి. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో కారిడార్‌లో భూసేకరణ పనులు  చేపట్టారు.ఈ  కారిడార్‌లో రోడ్ల విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌ కోసం తొలగించవలసిన  నిర్మాణాలను  ఇప్పటికే  గుర్తించిన సంగతి  తెలిసిందే. ఇందులో  భాగంగా 200 ఆస్తుల డిక్లరేషన్‌కు (100 ఎల్‌హెచ్‌ఎస్, 100 ఆర్‌హెచ్‌ఎస్‌) హైదరాబాద్‌ జిల్లా  కలెక్టర్‌  అనుదీప్‌ దురిశెట్టి  శనివారం ఆమోదం తెలిపారు. ఈ డిక్లరేషన్‌కు అనుగుణంగా అవార్డు డిసెంబర్‌ నెలాఖరు నాటికి  ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు. 

మరోవైపు ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.2 కిలోమీటర్ల మెట్రో అలైన్‌మెంట్‌లో భాగంగా  కూలి్చవేతలను తొలగించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహా్వనించింది. ఈ మేరకు తాజాగా టెండర్‌ నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ.1.3 కోట్లు వెచి్చంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెట్రో కోసం ఆస్తులు కోల్పోయిన వారికి జనవరి నుంచి పరిహారం చెల్లించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. 

కేబినెట్‌ ఆమోదం అనంతరం మెట్రో రెండో దశకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. అలాగే కేంద్రం ఆమోదం కోసం కూడా రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను  అందజేశారు. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అందజేయనున్న నిధులతో పాటు ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా  మెట్రో మొదటి దశలోనే జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి  ఫలక్‌నుమా వరకు నిరి్మంచవలసి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఎంజీబీఎస్‌ వరకే అది పరిమితమైంది. దీంతో ఈ  కారిడార్‌ను  రెండో దశలో చేర్చి  చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.ఈ మేరకు ఈ ఏడాది  మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ఫలక్‌నుమా వద్ద శంకుస్థాపన కూడా చేశారు.  

 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)