Breaking News

ఎన్‌ఆర్‌ఐ ప్లాటు కబ్జా

Published on Thu, 09/05/2024 - 12:55

మణికొండ: హైదరాబాద్‌ నగర శివారులో భూముల ధరలు పెరిగిపోతుండటంతో వాటిపై వివాదాలు సృష్టించి రూ.కోట్లు దండుకునేందుకు కొన్ని ముఠాలు  యత్నిస్తున్నాయి. ఇటీవల నార్సింగి రెవెన్యూ పరిధిలోని బృందావన్‌ కాలనీలో ఓ ప్లాట్‌ వివాదం ఏకంగాఎమ్మార్పీఎస్ నాయకుడి కిడ్నాప్‌ సంఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగులోకి వచి్చంది. 

ఓ ప్లాటు ప్రహరీ కూల్చి దానిని కబ్జా చేయటంతో పాటు అది ఖాళీ చేయాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన ముఠాను నార్సింగి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిరేవులలో ఎన్‌. మాధవీలత 2003లో 1200గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది.  

2017లో దాని చుట్టూ ప్రహరీ నిర్మించి తను అమెరికాలో ఉండటంతో తన తల్లి అరుణకు జీపీఏ ఇచ్చింది. ఈనెల 1న పెంజర్ల సుమన్, ఉప్పరి ముత్యాలు అనే వ్యక్తులు ప్రహరీని కూల్చి సదరు స్థలంలో కంటైనర్‌ ఏర్పాటు చేసి కబ్జాకు పాల్పడ్డారు. కంటైనర్‌ తొలగించి తాము తప్పుకోవాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఎన్‌. అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ప్లాట్‌ వద్ద ఉన్న పెంజర్ల సుమన్, ఆదిరాల గౌతమ్, మేడిపల్లి గణేష్‌, జంగం ప్రశాంత్, ఈడిగ శివకుమార్, పెంజర్ల జయప్రకాశ్, జంగం శంకర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.  

 

#

Tags : 1

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)